Inheritance Tax: వారసత్వ పన్ను అంటే ఏంటి, ఇండియాలో ఈ ట్యాక్స్ ఉందా లేదా

Inheritance Tax: ఇన్‌కంటాక్స్ విషయంలో ఇండియాలో ఉన్న చట్టాలు నిజంగా ట్యాక్స్ పేయర్లకు ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఆదాయంపైనే కాకుండా వారసత్వంగా వచ్చే ఆస్థులపై కూడా ట్యాక్స్ విధించే దేశాలున్నాయి. అదే వారసత్వ ట్యాక్స్ లేదా ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఇండియాలో ఉందా లేదా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2024, 08:04 AM IST
Inheritance Tax: వారసత్వ పన్ను అంటే ఏంటి, ఇండియాలో ఈ ట్యాక్స్ ఉందా లేదా

Inheritance Tax: అసలు ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి. ఈ ట్యాక్స్ అంటే ఎందుకు ట్యాక్స్ పేయర్లు భయపడతారో తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికాలో అమల్లో ఉన్న ఈ ట్యాక్స్ వారసత్వ సంపద కలిగినవారికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఆ సంపద నిర్ణీత పరిమితి దాటి ఉంటే. పరిమితి దాటితే మాత్రం ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిందే.

ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ పరిధిలోకి ఎవరెవరు వస్తారు, ఎవరు అర్హులో తెలుసుకుందాం. మీ తాత ముత్తాత్తల నుంచి లేదా తండ్రి నుంచి సంక్రమించే ఆస్తిపై ట్యాక్స్ ఉంటుందా అంటే మీకు కాదనే సమాధానం విన్పిస్తుంది. కానీ ఇటీవల కొద్దికాలంగా ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్‌పై రాజకీయంగా చర్చ రేగుతోంది. ఇండియాలో ఈ ట్యాక్స్ ప్రవేశపెడతారనే వాదన విన్పిస్తోంది. ఆ పరిస్థితి ఉండదని మరి కొందరంటున్నారు. ఎవరు ఏమనుకున్నా అసలు ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటో పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అనేది వారసత్వంగా సంక్రమించే ఆస్థిపై విదించే పన్ను. మీ తాత ముత్తాతలు, లేదా తండ్రి నుంచి మీకు ఏదైనా ఆస్థి సంక్రమిస్తే దానిపై ట్యాక్స్ వర్తిస్తుంది. కానీ ఈ ట్యాక్స్ ఇండియాలో అయితే ప్రస్తుతం లేదు. అదే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం తండ్రి నుంచి కొడుకుకు సంక్రమించే ఆస్తిపై ప్రభుత్వం 55 శాతం తీసుకుంటుంది. ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్‌పై అమెరికాలో ఫెడరల్ లా అంటూ ఏదీ లేదు. అమెరికాలోని చాలా రాష్ట్రాలు రెండు రకాల ట్యాక్స్  వసూలు చేస్తున్నాయి. ఒకటి ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ కాగా రెండవది ఎస్టేట్ ట్యాక్స్. ఎస్టేట్ ట్యాక్స్ అనేది మృతుని మొత్తం ఆస్థిపై విధించే ట్యాక్స్. ఇక ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఆ ఆస్తి ఎవరికి సంక్రమిస్తుందో వారిపై ఆ ఆస్థిపై చెల్లించాల్సిన ట్యాక్స్. 

వారసత్వంగా సంక్రమించే ఆస్థిపై ఈ ట్యాక్స్ ఉంటుంది. అది కూడా ఆ ఆస్థి విలువ 10 లక్షల డాలర్ల వరకూ ఉంటే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అదే 10 లక్షల డాలర్లు దాటితే మాత్రం 1-18 శాతం వరకూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మృతుని భార్య బతికి ఉంటే మాత్రం ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది. 

ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఇండియాలో ఎందుకు భయపడుతున్నారు

వాస్తవానికి ఇండియాలో కూడా ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ ఉండేది. కానీ 1985లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తొలగించారు. ఈ చట్టం ప్రకారం సదరు వ్యక్తి మరణంతో ఆ వ్యక్తి పిల్లలు లేదా మనవళ్లకు సంక్రమించే ఆస్థిపై ట్యాక్స్ ఉండేది. 1953 ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ ప్రకారం ఎస్టేట్ డ్యూటీ అనేది వారసత్వ ఆస్థి విలువపై 85 శాతం వరకూ ఉండేది. భారతదేశంలో చాలావరకూ ఆస్థులు వారసత్వంగా సంక్రమించేవే ఉంటాయి. అందుకే ఈ చట్టం పేరు వినగానే దేశ ప్రజలు భయపడే పరిస్థితి ఉంటుంది. 

Also read: Retirement Schemes: ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత డబ్బుల కొరత ఉండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News