Most Stolen Foods: ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న తిండి పదార్థం.. ఏదో తెలిస్తే షాక్!

Most Stolen Food in World: ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ.. ఎన్నో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. విలువైన వస్తువులతో పాటు.. ఆహార పదార్థాలు కూడా చోరీ అవ్వడం చాలా సహజం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చోరీ అయ్యే ఆహార పదార్ధం ఎంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దొంగతనానికి గురయ్యే ఫుడ్ ఐటెం తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 29, 2024, 03:29 PM IST
Most Stolen Foods: ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న తిండి పదార్థం.. ఏదో తెలిస్తే షాక్!

Most Stolen Food: ఎలాంటి దేశంలో అయినా దొంగతనాలు జరగడం చాలా సహజం. ప్రతి రోజూ ప్రపంచంలో.. ఏదో ఒక చోట.. ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంటుంది. ఆహారం కూడా ఎక్కువ శాతంలో దొంగతనానికి గురవుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా దోపిడీకి గురవుతున్న ఆహార పదార్థం ఏంటో తెలుసా? తెలిస్తే మీరు తప్పకుండా షాక్ కి గురవ్వడం ఖాయం.

ప్రపంచంలోనే ఎక్కువగా దొంగతనానికి గురవుతూ ఉండేది..బంగారం కాదు, వెండి కాదు, డబ్బు కాదు ఆఖరికి పెట్రోల్ కూడా కాదు. అదే చీజ్. మీరు చదివింది కరెక్టే. అధికంగా దొంగతనానికి గురవుతున్న ఆహార పదార్థం చీజ్. ఉదాహరణకు నెదర్లాండ్స్‌లోని ఒక షాప్ నుండి ఏకంగా.. 17 లక్షల.. విలువ చేసే చీజ్ దొంగతనం జరిగిందట. లారీలతో వచ్చి మరీ దొంగలు చీజ్ ను ఎత్తుకెళ్లిపోయారట. చీజ్ ను ఎంతగా వినియోగిస్తారో.. కొన్ని చోట్ల అంతే కొరత కూడా ఏర్పడుతోంది. అందుకే చీజ్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయి అని ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే ద్వారా బయటపడింది.

ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చీజ్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక అక్కడ ప్రతి షాప్ లో ఎంతో కొంత చీజ్ దొంగిలించబడుతూనే ఉంటుందట. ఆ దొంగిలించిన చీజ్‌ను ఆన్లైన్లో అమ్మి ఆ దొంగలు భారీ మొత్తంలో డబ్బులు చేసుకుంటున్నారట. అలాగే చీజ్ ను బ్లాక్ మార్కెట్లో కూడా అమ్మేవారు చాలామందే ఉన్నారట.

అందుకే ప్రపంచంలో ఎక్కువగా దొంగతనం చేయబడుతున్న ఆహారపదార్థంగా చీజ్ మొదటి స్థానం ఆక్రమించగా, రెండవ స్థానంలో మాంసం, మూడో స్థానంలో చాక్లెట్, నాలుగో స్థానంలో ఆల్కహాల్ నిలబడ్డాయి.

భారత దేశం లో చీజ్ తక్కువగానే వినియోగిస్తారు కానీ.. పాశ్చాత్య దేశాల్లో మాత్రం చీజ్ లేకుండా రోజువారీ ఆహారం ఉండదు. వారి బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ దాకా.. తినే చాలా పదార్థాలలో చీజ్ ఉంటుంది. అసలు కొన్ని వందల కోట్ల రూపాయల మార్కెట్ కేవలం చీజ్ మీదే నడుస్తోంది. అయితే ఆసక్తికరంగా ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతున్న చీజ్‌లో నాలుగు శాతం దోపిడీకే గురవుతోందట. ముఖ్యంగా 43 పెద్దదేశాల్లో చీజ్‌ను ఎక్కువగా దొంగిలిస్తున్నట్టు సమాచారం. 

పాలలో కేసైన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని వల్ల చీజ్ తయారవుతుంది. ఇది ఈ మధ్య కనిపెట్టిన ఆహారం కాదు. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి చీజ్ ఆహారంలో భాగమై ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఒక మనిషి ఏడాదికి 25 కిలోల చీజ్ ను తినేస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో అయితే దాదాపు 25 బిలియన్ల డాలర్ల చీజ్‌ను తినేస్తూ ఉంటారట.

ఇక ఎక్కువగా దొంగతనం అవుతున్న చీజ్ లో కూడా చాలా రకాల ఉన్నాయి. చెద్దార్ చీజ్, మోజారెలా చీజ్, స్మోక్డ్ చీజ్ అంటూ చాలా వెరైటీ లు ఉంటాయి. కొన్ని కాస్త ఉప్పుగా ఉండడంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక బ్రెడ్ మీద, పిజ్జా మీద, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆహార పదార్ధాల మీద ఈ చీజ్‌ ను చల్లుకొని తింటే ఆ రుచే వేరు.

Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News