DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

TSSPDCL Suspends Keesara DE Over Malla Reddy Poll Meeting Power Cut: విద్యుత్‌ కోతలు తెలంగాణలో తీవ్ర రాజకీయం దుమారం రేపుతుండగా.. మల్లారెడ్డి మీటింగ్‌లో ఎదురైన సంఘటన కారణంగా ఓ ఉద్యోగి ఉద్యోగం ఊడిపోయింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2024, 11:16 AM IST
DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

Keesara DE Suspend: తెలంగాణలో విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే కాదు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా విద్యుత్‌ కోతలతో అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ కోతల అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమావేశంలో విద్యుత్‌ కోతలు రావడం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే మల్లారెడ్డి సమావేశంలో విద్యుత్‌ కోతలకు కారణమైన ఉద్యోగిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కారకుడిగా భావిస్తూ డీఈని విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నాగారంలో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీన ఓ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాదాపు అరగంట పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడడంతో రాజకీయంగా వివాదాస్పదమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇలా ఉంది పాలన అంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. తమ పాలనలో 24 గంటలు విద్యుత్‌ అందిస్తే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని వివరించారు.

Also Read: Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి

 

ఈ సంఘటనను విద్యుత్‌ శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. హైదరాబాద్‌ హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) ఎల్‌. భాస్కర్‌ రావుపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ సస్పెన్షన్‌ వేటు వేశారు. మొదట విచారణ చేసిన అధికారులు అనుమతి లేకుండా 30 నిమిషాల పాటు కరెంట్‌ కోత విధించారని నిర్ధారణ చేశారు. ఉన్నత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా అర్ధగంట విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన డీఈ, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

ఇలా చేయాలి..
అత్యవసర పరిస్థితుల్లో లైన్‌ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకోవాలన్నా.. సర్కిల్‌ ఎస్‌ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ ఆ రోజు అనుమతి లేకుండానే ఎల్‌సీ ఇవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా డీఈపై వేటు పడగా.. త్వరలోనే ఏఈఈపై కూడా చర్యలు తీసుకోనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News