TS EAMCET 2024 Hall Ticket Download: తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) 2024 హాల్టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో ఎంసెట్ పరీక్షకు విద్యార్థులు సిద్ధమయ్యారు. TS EAPCET 2024 పరీక్షకు దాదాపు 3.5 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలకు 2.5 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు 98 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ.5 వేల అపరాధ రుసుముతో మే 1వ తేదీ వరకు ఇంకా దరఖాస్తు చేసుకునేందుక అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మే 7, 8, 9, 10, 11వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్లో మూడు గంటల పాటు నిర్వహించనున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..? ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.